రంజాన్ రిక్వెస్ట్’కు.. ఓకే !

కరోనా ఎఫెక్ట్ తో పండగలని పండగలా చేసుకోలేని పరిస్థితి. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో ఉగాధి, శ్రీరామనవమి, గుడ్ ఫ్రై డే, ఈస్టర్ సెలబ్రేషన్స్ రద్దయ్యాయి. ఈ జాబితాలో రంజాన్ కూడా చేరనుంది. రంజాన్ ప్రార్థనలని సాముహికంగా కాకుండా.. ఇంటివద్దే చేసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వం సూచననని ముస్లిం మత పెద్దలు ఓకే చేశారు.

సోమవారం మంత్రి కేటీఆర్ తో ముస్లిం మతపెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క‌రోనా వైర‌స్ నివార‌ణ‌లో ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు ముస్లిం మ‌త పెద్ద‌లు తెలిపారు. రంజాన్ మాసం సంద‌ర్భంగా సామాజిక దూరాన్ని పాటించుట‌కై త‌మ ఇళ్ల వ‌ద్ద‌నే అన్ని ప్రార్థ‌న‌లు నిర్వ‌హించాల‌ని ముస్లింల‌కు విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు తెలిపారు.