చిరంజీవికి, నాకు అక్కడే తేడా వచ్చింది..!! : అల్లు అరవింద్
ఎంత మంచి అనుబంధాలమధ్య అయినా ఎక్కడో ఓ చోట తేడా వస్తుంటుంది.. అలాగే మెగా స్టార్ చిరంజీవికి, అల్లు అరవింద్ కి మధ్య కూడా ఓ చోట తేడా వచ్చిందట. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలకు తావిచ్చిందట. మెగాస్టార్ చిరు, అల్లు అరవింద్ ల మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. బావ, బావమరుదుల బంధానికి మించిన అనుబంధం వాళ్లది. ఒకరకంగా కృష్ణార్జునులు అని చెప్పుకోవచ్చు.
అలాంటి వారిద్దరి మధ్య ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు రాలేదని చెప్పడంలో ఆశ్చర్యం లేదట. చిరంజీవి ఉన్నతికి వెనకుండి వెన్నుదన్నుగా నిలిచింది కూడా అల్లు వారి కుటుంబమే. అయితే అల్లు అరవింద్ ఓ ఇంటర్వూలో వారిద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చిన సందర్భం గురించి చెప్పుకొచ్చారు.
తమ మధ్య ఇప్పటి వరకు ఎలాంటి భేదాభిప్రాయాలు రాలేదని, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని, అయినా తరువాత అంతా అర్ధం చేసుకుని సర్ధుకు పోయామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి తేడాలు లేవని, తాము హ్యాపీగానే కలిసున్నామని చెప్పారు అల్లు అరవింద్..