అభిమానులకి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారా ?

యంగ్ టైగర్ అభిమానులకి గుడ్ న్యూస్. ఎన్టీఆర్ బర్త్ డేకి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. తారక్ పుట్టినరోజు కానుకగా మే 20న ‘రామరాజు ఫర్ భీమ్’ రావాల్సి వుంది. అయితే కరోనా లాక్‌డౌన్ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ని రెడీ చేయడం కష్టంగా మారిందని రాజమౌళి చెబుతున్నారు. ఉన్నంతలో ‘రామరాజు ఫర్ భీమ్’ని తీసుకురావడం మాత్రం గ్యారెంటీ.

మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ ని మాటల మాత్రింకుడు త్రివిక్రమ్ కూడా రెడీ చేశారట. ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తారక్ పుట్టినరోజు కానుకగా మే 20న ఈ సినిమా టైటిల్ ని విడుదల చేయనున్నారు. ఎప్పటిలాగే.. త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ తో ఓ టైటిల్ ని రెడీ చేసినట్టు సమాచారమ్. అదేంటన్నది.. ? మే 20న తెలియనుంది.