బాలయ్యకి ఛాలెంజ్ విసిరిన తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన బాబాయ్ బాలయ్యకి ఛాలెంజ్ విసిరాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సరికొత్త ఛాలెంజ్ ని తీసుకొచ్చారు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా. ఇంట్లో ఉంటున్న మనం మహిళలకి సాయం పడదాం. ఇంటి పనులు చేద్దాం. మంచి మనిషి అనిపించుకుందామని సందీప్ వంగా దర్శకధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు.

దానిని స్వీకరించిన రాజమౌళి ఇంట్లో పనులు చేసి.. దానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. జక్కన్న ఈ ఛాలెంజ్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, కీరవాణీలకి విసిరారారు. తాజాగా ఈ ఛాలెంజ్ ని యంగ్ టైగర్ ఎన్ టీఆర్ పూర్తి చేశారు. దానికి సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. “మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం” అంటూ కామెంట్ పెట్టాడు.

ఇక తారక్ ఈ ఛాలెంజ్ ని ఆయన బాబాయ్ బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, కొరటాల శివకి విసిరారు. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అందరినీ తారక్ ఛాలెంజ్ చేశాడు అన్నమాట. ఈ నేపథ్యంలోనే త్వరలోనే వీరి ఇంటిపనుల వీడియోని చూసే అదృష్టం ప్రేక్షకులకి దక్కనుంది.