లీటర్ పెట్రోల్ ధర రూ. 7 మాత్రమే !

పెట్రోల్ ధర భారీగా పడిపోయింది. లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 7 మాత్రమే. అది మన దగ్గర కాదు. లాక్ డౌన్, ట్రావెల్ రిస్ట్రిక్ష‌న్స్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లో భారీ ప‌త‌నం చోటు చేసుకుంటోంది. ఇప్ప‌టికే ఓపెక్ దేశాలు పెట్రోల్ తోడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించాయి.

అంత‌ర్జాతీయంగా డిమాండ్ ఏ మాత్రం లేని నేప‌థ్యంలో.. రెండు నెల‌ల పాటు ఉత్ప‌త్తిని ఆపేయాల‌ని అవి నిర్ణ‌యించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అంత‌ర్జాతీయంగా ఉన్న క్రూడ్ ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే.. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 7 రూపాయ‌లు అని లెక్క‌గ‌డుతున్నారు నిపుణులు. అయితే భారత్ మాత్రం పెట్రోల్ ని కొనుగోలు చేస్తోంది. రేపటి రోజున లాక్ డౌన్ ఎత్తేశాక.. రూ. 7కి దొరికిన లీటర్ పెట్రోల్ ధరని రూ. 75కిపైగా అమ్ముకుంటే భారీ లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.