తారక్ ఛాలెంజ్ పై కొరటాల స్పందన

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో టాలీవుడ్ లో #BetheREALMAN ఛాలెంజ్ కి మంచి స్పందన దక్కుతోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఈ ఛాలెంజ్ ని తీసుకుచ్చారు. కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమైన మగవారు ఆడవాళ్లకి సాయం చేయాలి. మంచి మనిషి అనిపించుకోవాలని ఈ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు సందీప్. దానిని దర్శకధీరుడు రాజమౌళికి విసరడం. దాన్ని ఓకే చేసిన జక్కన్న ఇంటి పనులని చేస్తున్న వీడియోని షేర్ చేశారు.

ఈ ఛాలెంజ్ కి రాజమౌళి ఎన్ టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, కీరవాణిలని నామినేట్ చేశారు. వీరిలో ముందుగా తారక్ ఛాలెంజ్ ని పూర్తి చేశాడు. ఆయన మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, కొరటాల శివ, వెంకీ, నాగ్ లని నామినేట్ చేశాడు. తాజాగా ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్టు కొరటాల తెలిపారు. ‘ఛాలెంజ్ స్వీకరించాను తారక్ అన్నయ్య. ఇప్పటికే నెల రోజు ఫూటేజ్ మిస్ అయిందని చమత్కరించారు.