‘వకీల్ సాబ్’ నుంచి శృతి తప్పుకోలేదట

‘వకీల్ సాబ్’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, నివేదా థామస్‌, అనన్యా నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, నరేష్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ కి జంటగా శృతిహాసన్ ని తీసుకొన్నారు. అయితే ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్టు ఇటీవలే ప్రకటించింది.

“వకీల్ సాబ్ అవకాశం ఇలా వచ్చి వెళ్లింది. అదింకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే, వకీల్ సాబ్ లో నేను నటిస్తున్నాననేది రూమర్ కంటే ఇంకాస్త పెద్దది అనుకోవచ్చు. సో.. వకీల్ సాబ్ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నేను అందులో పవన్ కు భార్యగా నటిస్తున్నానని, ఆల్రెడీ షూట్ కు వెళ్లానని అంటున్నారు. అది వాస్తవం కాదు” అంటూ శృతి హాసన్ ట్విట్ చేసింది.

లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? వకీల్ సాబ్ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకోలేదు. దీనిపై దర్శకుడు వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు. “శృతి తప్పుకోలేదు. లాక్‌డౌన్ తరువాత డేట్లను ఎలా అడ్జెస్ట్ చేయగలదు అని మేము ఆలోచిస్తున్నాం. ఆమె షూటింగ్‌లో జాయిన్ అయిన తరువాత పవన్‌, శ్రుతీపై ఓ పాటను చిత్రీకరిస్తాం” అని తెలిపారు.