లాక్డౌన్ రూల్స్ బ్రేక్ : మహేష్ బంధువుపై పోలీస్ కేసు
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు, ఫంక్షన్స్ పై ఆంక్షలు విధించారు. ఎవరైనా రూల్స్ కి వ్యతిరేకంగా పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకుంటే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించాయి. అయినా.. ఆ హెచ్చరికలని ఏమాత్రం పట్టించుకొని కన్నడ యాంకర్ అకుల్ బాలాజీ.. లాక్డౌన్ నిబంధనలను ఆయన ఉల్లంఘించారు.
ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో అకుల్ బాలాజీపై కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు. మరీ.. ఇతడికి సూపర్ స్టార్ మహేష్ బాబుకి బంధం ఎలా అంటే.. ? మహేష్ కి అకుల్ బాలాజీ దూరపు బంధువు అవుతారు. కన్నడలో ‘మానే ముండే మహాలక్ష్మి’, ‘ప్యాతే హుద్గిర్ హల్లీ లిఫు సీజన్ 1&2’, ‘హోసా లవ్ స్టోరీ’ లాంటి రియాలటీ షోలకు అకుల్ బాలాజీ హోస్ట్ గా వ్యవహరించారు.