తెలంగాణలో వలస కూలీ ఆనందం చూశారా.. ?
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ వలస కూలీలు చాలా సంతోషంగా ఉన్నారు. వారిని తమ సొంత బిడ్దల్లా చూసుకుంటామని సీఎం కేసీఆర్ హామి ఇచ్చారు.
తెలంగాణ పేదలకి ఇచ్చినట్టుగానే వలస కూలీలకి ఒక్కొకరి చొప్పున 12కిలోల బియ్యం ఇచ్చారు. రూ. 500 అందజేశారు. అంతేకాదు.. వలస కూలీలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా స్థానిక ప్రజా ప్రతినిధులని కలవమని చెప్పారు. అలా కలిసిన వారికి నిత్యవసర సరుకులని అందజేస్తున్నారు.
తాజాగా ఓ వలస కూలీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిత్యవసర వస్తువులని తెచ్చుకున్నారు. వాటిని ఓపెన్ చేసి చూపిస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కి కృతజ్ఝతలు చెప్పారు. ఈ ఆనదంలో తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి జై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This is how Telangana Government and CM KCR is taking care of migrant workers in Telangana. #DildaarCM @KTRTRS @TelanganaCMO @trspartyonline @TNewstg pic.twitter.com/bfKuAWqVN7
— Thirupathi bandari (@BTR_KTR) April 21, 2020