కేబీఆర్ పార్క్ లో పులి.. అంతా ఉత్తిదే !

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ నుంచి ఓ పులి బయటికొచ్చిందనే వీడియో ఒకటి వైరల్ అయింది. ఇందులో ఓ పులి పార్క్ నుంచి మెల్లిగా బయటికొచ్చి రోడ్ క్రాస్ చేయడం చూడొచ్చు. నిజంగానే ఇది కేబీఆర్ పార్క్ కి సంబంధించిన వీడియో అనుకున్నారు. దీంతో ప్రతిరోజూ వాకింగ్ కోసం కేబీఆర్ పార్క్ కి వెళ్లే అలవాటు ఉన్నవారు కంగు తిన్నారు.

ఈ వైరల్ వీడియో నిజమో.. కాదో తెలుసుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలన్నింటిని పరిశీలించారు. ఎందులోనూ పులి కనిపించలేదు. దీంతో ఇది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.