ఆస్కార్ అందుకున్న సినిమాపై రాజమౌళి అసంతృప్తి
2020 ఆస్కార్ అవార్డుల్లో విదేశీ ఉత్తమ చిత్రంగా నిలిచింది కొరియన్ సినిమా ‘పారాసైట్’. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లోనూ అవార్డులు అందుకుంది. అయితే ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రాజమౌళి అమెజాన్ ప్రైమ్ లో పారాసైట్ సినిమాని చూశారట. అయితే సినిమా బోరింగ్‌గా అనిపించింది. సినిమా చూస్తూ మధ్యలోనే నిద్రపోయా. తనకు అంతగా నచ్చలేదని తెలిపారు జక్కన్న.
‘పారాసైట్’ కథేంటీ అంటే.. ? ఓ పేద కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటుంటుంది. భార్య భర్త, వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉంటారు. కుమారుడు తన స్నేహితుడి సహాయంతో ధనవంతులైన ఓ కుటుంబాన్ని మోసం చేసి, పనిలో చేరుతాడు. ఆపై తన సోదరిని, అమ్మానాన్నలను కూడా అదే ఇంటిలో వేరువేరు పనులకు కుదుర్చుతాడు. కానీ వీరంతా ఒకే కుటుంబం వారని, మోసం చేస్తున్నారని యజమానులకు తెలియకుండా జాగ్రత్తగా ఉంటారు. ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే రాజమౌళికి మాత్రం ఈ సినిమా పెద్దగ అనచ్చలేదు.