కరోనా పెరిగాయని.. ఇద్దరు డీఎస్పీల బదిలీ !

కరోనా ఖాకీలకి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయంలో విధులు నిర్వహించడమే కాదు. విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా.. వారికి ఇబ్బంది మారింది. తెలంగాణలోని సూర్యపేత, గద్వాల జిల్లాల్లో కరోనా కేసులు రోజురోజూకి పెరుగుతున్నాయి.

సూర్యపేట జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 26 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80 కి చేరింది. గద్వాలలోనూ ఇదే తరహా కరోనా కేసులు రోజురోజూకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యపేట డీఎస్పీ ఎం నాగేశ్వర రావు, గద్వాల డిఎస్పీ పి. శ్రీనివాస రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. వీరిని రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.