చంచల్ గూడ జైలు బయట టెన్షన్ టెన్షన్..!
మందకృష్ణ మాదిగ బెయిల్ పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జైలు బయట వందలాది మంది మందకృష్ణ కోసం వేచి ఉన్నారు. జైలు బయటకు వచ్చిన మందకృష్ణ తమ కార్యకర్తలకు అభివాదం చేసి వెళతానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేరుగా వాహనంలో వెళ్లిపోవాలంటూ పోలీసులు మందకృష్ణను అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మందకృష్ణ ఎప్పుడు ఏ పిలుపునిస్తారోనని టెన్షన్ వాతావరణం నెలకొంది.