సన్నీ భర్త ఫిర్యాదు.. ఆమె ఎప్పుడూ అదే మూడులో ఉంటుంది !
కరోనా లాక్‌డౌన్ తో గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా గృహ హింసకు గురవుతున్నారు. వీరిలో కొందరు తమ బాధలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. హాట్ బ్యూటీ సన్నీ లియోన్ భర్త డానియల్ కూడా భార్య బాధితుడే. తాజాగా సన్నీ దారుణాలని డానియెల్ ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ.. ఓ వీడియో తీశారు. దానిని తన ఇన్ స్టార్ గ్రామ్ లో షేర్ చేశారు.
“ఆమె రోజంతా నిద్రపోతుంది. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ వంట దారుణం. ఆమె చాలా బద్దకస్తురాలు. ఎప్పుడు పైజామాలోనే ఉంటుంది. రోజంతా సెల్ఫీలు దిగుతూనే ఉంటుంది” ఫ్ల కార్డులని ప్రదర్శించారు. దీనిపై సన్నీ స్పందించింది. ‘ఇప్పుడే దీన్ని చూశా.. రేపు నిజంగా డానియెల్ రోజంతా ఏం చేస్తాడో చూపిస్తా. రివేంజ్` అంటూ కామెంట్ చేసింది. మరీ సన్నీ రివెంజ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది చూడాలి.