సంచలన వెబ్ సిరీస్ ఆన్ లైన్ లో లీకు
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఓటీటీకి డిమాండ్ పెరిగింది. ఇంటి పరిమితమైన జనాలు డిజిటల్ ఫార్మెట్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ.. సమయాన్ని గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ‘Four More Shots Please Season2’ అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం రేపుతున్నది.
పూర్తిగా అడల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సిరీస్ యువతను విశేషంగా ఆకట్టుకొంటున్నది. అడ్డదారులు తొక్కైనా, నైతిక విలువలు తుంగలో తొక్కైనా జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి, ఆస్వాదించాలనే నలుగురు యువతులు, పురుషుల కథ ఇది. ఈ వెబ్ సిరీస్ ని హాట్ హాట్ సీన్లతో నింపేశారు. దీంతో యువత ఎగబడీ మరీ చూస్తున్నారు.
ఇప్పుడీ వెబ్ సిరీస్ కు తమిళ్ రాకర్స్ నుంచి షాక్ తగిలింది. ఈ వెబ్ సిరీస్‌ను లీక్ చేయడం చేశారు. ఇలా అమెజాన్ ఒరిజినల్ సిరీస్ లీక్ కావడం.. పెద్ద నష్టామేనని చెబుతున్నారు.