ఆర్ఆర్ఆర్ : రాజమౌళి కొత్త టార్గెట్

‘కరోనా ముందు తర్వాత జీవితం ఒకేలా ఉండదు’ ప్రధాని నరేంద్ర మోడీ అన్న మాట ఇది. ఇది నిజం. సినిమాల పరిస్థితి కూడా అంతే. కరోనా తగ్గినా మునుపటిలా సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. అసలు ఈ యేడాది షూటింగ్స్, థియేటర్స్ తెరచుకొనేలా లేవు. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు కొత్త టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కొత్త టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్వాత్రంత్య్ర సరమయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కథ ఇది. వీరిద్దరి మధ్య గల కామెన్ పాయింట్ ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ కఅథని రెడీ చేశారు రాజమౌళి. ఇందులో కొమరం భీమ్ గా తారక్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ యేడాది జులై 30కి రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ కొన్ని కారణాల వలన వచ్చే యేడాది జనవరి 8కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ యేడాది థియేటర్స్ తెరచుకొనే పరిస్థితి లేదు. ఒకవేళ తెరచుకున్నా జనాలు మునుపటిలా థియేటర్స్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ వచ్చిన ప్రభుత్వం పెట్టే షరతులతో ఒకప్పటిలా థియేటర్స్ కళకళాడే పరిస్థితులు ఉండకపోవచ్చు.

ఈ నేపథ్యంలోనే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ విషయంలో రాజమౌళి కొత్త టార్గెట్ పెట్టుకున్నారట. కరోనా ఎఫెక్ట్ మొత్తం ముగిసి.. ప్రజలు ఆ భయం నుంచి భయపడే వరకు ఆర్ ఆర్ ఆర్ ని రిలీజ్ చేయకూడదని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాని వచ్చే యేడాది సమ్మర్ లో రిలీజ్ అనుకుంటున్నట్టు సమాచారమ్.