చీపురు పట్టిన సుకుమార్

టాలీవుడ్ సెలబ్రిటీలు మంచి మనుషులు అనిపించుకుంటున్నారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా తీసుకున్న #BeTheREALMAN ఛాలెంజ్ టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన మనం.. మహిళలకి సాయం చేద్దాం. మంచి మనిషి అనిపించుకుందామని సందీప్ ఈ ఛాలెంజ్ ని తీసుకున్నారు.

ఈ ఛాలెంజ్ ని ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళితో సహా ఆర్ఆర్ఆర్ కథానాయకులు ఎన్ టీఆర్, రామ్ చరణ్ లు పూర్తి చేశారు. తాజాగా ఈ ఛాలెంజ్ ని దర్శకుడు సుకుమార్ కూడా పూర్తి చేశారు. ఆయన చీపురు పట్టి ఇల్లు ఊడ్చారు. గిన్నెలు తోమారు. సుక్కు ఇంటిపనులకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక సుక్కు ఈ ఛాలెంజ్ కోసం దేవిశ్రీ ప్రసాద్, దర్శకులు వంశీపైడిపల్లి, సురేందరెడ్డి, కొరటాలశివ లతో పాడు నిర్మాత దిల్ రాజుని నామినేట్ చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం కాలేదు. ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘పుష్ప’ తెరకెక్కనుంది. రష్మిక మందన హీరోయిన్. మరో హీరోయిన్ గా నివేదా థామస్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్కు, బన్నీలకి ఇది తొలి పాన్ ఇండియా సినిమా. కరోనా ప్రభావంతో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఆ ప్రభావం ముగియగానే షూటింగ్ మొదలు కానుంది.