స్లీప్ పరాలసిస్‌తో బాధపడుతున్న బాలీవుడ్ హీరో


బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను స్లీప్ పరాలసిస్‌తో బాధపడినట్టు చెప్పారు. స్లీప్ పరాలసిస్ అనేది నిద్రపోతున్నప్పుడు లేదా మేల్కోవడానికి కదులుతున్న సమయంలో వస్తుంది. అప్పుడు మన శరీరం పూర్తిగా బిగుసుకుపోతుంది. ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంటుంది.

కరోనా లాక్‌డౌన్ తో సినీతారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా వేదికగాఅభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. మరికొందరు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏఎమ్ఏ చేపట్టిన ఓ కార్యక్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకి విక్కీ కౌశల్ సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా తాను స్లీప్ పరాలసిస్‌తో బాధపడుతున్నానని తెలిపారు.

ఇక విక్కీ కౌశల్ సినిమాలతోనే కాదు.. ఎఫైర్స్ తోనే హెడ్ లైన్స్ లోకి ఎక్కాడు. ఆయన ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పలు సార్లు వీరిద్దరు కలిసి మీడియాకి చిక్కిన సంగతి తెలిసిందే.