పెళ్లయితే అంతే.. కోహ్లీ !
పెళ్లి తర్వాత తనలో దూకుడు తగ్గిందని తెలిపారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. గతంలో తాను చాలా దూకుడుగా ఉండేవాడిని. అనుష్క పరిచయం, ప్రేమ, పెళ్లి.. తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని కోహ్లీ తెలిపారు.
“నిజాయతీగా చెప్పాలంటే అనుష్కతో పరిచయం నాలో చాలా మార్పులకు కారణమైంది. గతంలో నేను ప్రతీ చిన్న విషయానికి కొప్పడేవాడిని. ఇప్పుడు ఆ ధోరణి మారింది. అనుష్క నాలో శాంతాన్ని నింపిందనుకుంటా. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయకపోవడంతో చాలా బాధపడ్డా.. రాత్రంతా కూర్చొని ఏడ్చా”నని చెప్పుకొచ్చాడు. కోహ్లీ మాటలు విన్న నెటిజన్స్.. పెళ్లయితే అంతే.. కోహ్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు.