లోక్ సభని తాకిన కరోనా

కరోనా మహమ్మారి దేశాధినేతలు, చట్టసభలని వదలడం లేదు. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వెయ్యికి పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కు కరోనా సెగతాకిందనే వార్తలు వింటున్నాం. తాజాగా లోక్‌సభకు వైరస్ పాకినట్లుగా తెలుస్తోంది. లోక్‌సభ సచివాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ హౌస్‌కీపర్‌కు కరోనా వైరస్‌ సోకినట్టు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం అతడిని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే… ? బాధిత ఉద్యోగి గత 35రోజుల నుంచి కార్యాలయంలో విధులకు హాజరుకాలేదని తెలిసింది. లాక్‌డౌన్‌ విధించడానికి నాలుగురోజుల ముందే అతను రావడం మానేశాడని చెబుతున్నారు. గత వారంరోజులుగా అతడు జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్‌గా తేలిందని చెబుతున్నారు.