‘భీష్మ’ డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఒకప్పటిలా థియేటర్స్ లో సినిమా రిలీజ్ కోసం ఎదురుచూసే పరిస్థితి పోయింది. కరోనా ఇలాక్‌డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయి. తిరిగి థియేటర్స్ ఎప్పుడు తెరచుకుంటాయ్ అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన జనాలు సినిమాల డిజిటల్ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్ట్స్.. లాంటి డిజిటల్ ఫార్మెట్స్ లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే వరల్డ్ ఫేమస్ లవ్వర్ డిజిటల్ ఫార్మెట్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకొంది. తాజాగా భీష్మ సినిమా డిజిటల్ ఫార్మెట్ లో రిలీజ్ కి డేట్ ఫిక్సయింది. ఈ నెల 25 నుంచి భీష్మ సన్ నెక్ట్స్, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఓ పోస్టర్ ని విడుదల చేసింది.

వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన ‘భీష్మ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకులని మంచి వినోదాన్ని పంచింది. సూపర్ హిట్ అయింది. ఇప్పుడు డిజిటల్ ఫార్మెట్ లోనూ భీష్మ సత్తా చాటుతుందేమో చూడాలి.