అప్పుడు చిరంజీవి దేవుడిలా ఆదుకొన్నారు : హేమ
నటి హేమ రక్తదానం చేశారు. బుధవారం హేమ తన కూతురుతో కలిసి చిరంజీవి బ్లెడ్ బ్యాంక్ కి వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పదహారేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు.
‘పదహారేళ్ల క్రితం డెలివరీ సమయంలో నాకు తీవ్ర రక్తస్రావం జరిగింది. రక్తం అవసరమైంది. నాది అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో ఎక్కడా దొరకలేదు. అప్పుడు రాజారవీంద్రకు ఫోన్ చేస్తే.. ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చారు. రక్తం విలువ అప్పుడు అర్థమైంది. అందుకే నేను, నా కూతురు రక్తదానం చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చాం’ అని హేమ తెలిపారు.