దొరలకో చట్టం.. దళితులకో చట్టమా…?
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తోందని, మను ధర్మ చట్టాన్ని అవలంభిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్ పై నిర్బంధ కేసులు నమోదు కాలేదు, కానీ శాంతి యుత ర్యాలీ నిర్వహిస్తే 20 కేసులు పెట్టారని విర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా మిలియన్ మార్చ్ లో పాల్గొన్న కేసీఆర్ పై, ఆయన కుటుంబ సభ్యులపై నిర్బంధ కేసులు లేవు అని ఆయన చెప్పారు. దొరలకు ఒక చట్టం… దళితులకు ఒక చట్టమా? అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్ళాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.
జనవరి ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉపవాస దీక్షలు కొనసాగిస్తామన్నారు. బాపుఘాట్ వద్ద లేదంటే ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో ఉపవాస దీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పది రోజుల పాటు కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే ఎమ్మార్పీఎస్ అండగా నిలిచిందని, కానీ వర్గీకరణ కోసం శాంతి యుత ర్యాలీ నిర్వహిస్తే కేసీఆర్ తనను 10 రోజులు జైల్లో పెట్టారని విమర్శించారు.