ఉత్తర కొరియా కొత్త అధ్యక్షుడు ఎవరు ?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలొస్తున్నాయ్. ఆయనకి బ్రెయిన్ డెడ్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టబోయేది ఎవరు ? చర్చ మొదలైంది. అందురు కిమ్ చెల్లెలు కిమ్ యో జోంగ్ పేరు చెబుతున్నారు.
ఆమె 2017 నుంచి కిమ్ పక్కన తరచూ కనిపిస్తోంది. గత నెలలో ఉత్తరకొరియా-అమెరికా చర్చల్లో కీలక పాత్ర వహించిన యో జోంగ్ ని అమెరికా అధ్యక్షుడు మెచ్చుకున్నప్పుడు ప్రపంచం దృష్టిలో పడింది. యోని ఉక్కు మహిళగా చెబుతుంటారు. కిమ్కి యో మొదట్నుంచీ నమ్మినబంటు. వాళ్లిద్దరి మధ్య వయసులో ఐదేళ్ల తేడా. ఇద్దరూ స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో కలిసి చదువుకున్నారు. పాలనాపరంగా కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆమె పాత్ర, ప్రభావం ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు. ఆమె ఉత్తర కొరియా కొత్త అధ్యక్షురాలు అవుతారని చెప్పుకొంటున్నారు.