మరో ‘గూఢాచారి’ని రెడీ చేస్తున్నా

యువ కథానాయకుడు అడవిశేష్ మరో గూఢాచారిని రెడీ చేసే పనిలో ఉన్నారు. శశి కిరణ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘గూఢాచారి’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రచనలోనూ అడివిశేష్ భాగస్వామి అయ్యాడు. ‘లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన అడవిశేష్ ప్రసుత్తం గూఢాచారి 2 స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.

“ప్రస్తుతం నేను ప్రస్తుతం ‘గూఢచారి 2’ స్ర్కిప్ట్‌ రాస్తున్నాను. అలాగే ‘మేజర్‌’ సినిమా ఎడిటింగ్‌ పనులు కూడా చూస్తున్నాను. లాక్‌డౌన్‌కు కొన్నిరోజుల ముందు ‘మేజర్‌’ సినిమాలోని అతి ముఖ్యమైన సన్నివేశాలను బోర్డర్‌లో చిత్రీకరించాం. ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ఇదే చాలా క్లిష్టమైన షూట్‌. ఇప్పటికే గుర్తుండిపోయే ఓ గొప్ప అనుభవం’ అని శేష్‌ పేర్కొన్నారు.