శృంగారం ద్వారా కరోనా వ్యాపిస్తుందా ?
ప్రపంచ దేశాలని కరోనా వణికిస్తోంది. ఈ మహమ్మారికి మందు లేదు. ముందు జాగ్రత్తలే శరణ్యం. అయితే శృంగారం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే అపోహలున్నాయి. ఎబోలా, జికా, కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్ ల తరహాలో కొవిడ్-19 కారక సార్స్ కోవ్ కూడా శృంగారం ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
ఇందులో భాగంగా చైనాలో 34 మంది రోగుల వీర్యం నమూనాలను విశ్లేషించారు.వీటిలో వైరస్ కనిపించలేదు. దీంతో శృంగారం ద్వారా వ్యాప్తి చెందదని శాస్త్రవేతలు తేల్చారు. అయితే, ఇది చాలా ప్రాథమిక స్థాయి అధ్యయనమని, మరింత లోతుగా పరిశీలన సాగాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.