తెలంగాణలో ఆ నాలుగు ప్రాంతాల్లోనే కరోనా అధికం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. ఇప్పటికే వరకు 983 కరోనా కేసులు నమోదయ్యాయ్. అయితే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయ్యాయి. జీహెచ్ ఎంసీ పరిధిలోని 44 కుటుంబాల ద్వారా 265 మంది కరోనా బారిన పడ్డారు. వికారాబాద్ లో 14 కుటుంబాల నుంచి ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.

సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా సోకిందని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. పరిస్థితి విషమించిన రోగులకు ప్లాస్మా థెరపీ చేస్తారని.. అందుకోసం దరఖాస్తు చేస్తే అనుమతి వచ్చిందని ఈటల తెలిపారు. ఇక దేశంలో మే 3 వరకు లాక్ డౌన్ విధించగా.. తెలంగాణలో మాత్రం మరో 4 రోజులు అదనంగా అంటే.. మే 7 వరకు లాక్ డౌన్  కొనసాగనుంది.