జెండా ఎగరువేసిన సీఎం కేసీఆర్
గులాబీ జెండా చేతపట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు మన కేసీఆర్. సుదీర్ఘంగా చేసిన ఉద్యమ ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయింది. ఒకప్పుడు చీదరింపులకి గురైన మన యాస, మన భాష, మన సంస్కృతికి ఇప్పుడు గౌరవం పెరిగింది. తెలంగాణ బిడ్డ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇక ఈ క్రమంలో గులాబీ జెండా, టీఆర్ ఎస్ పార్టీ 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఎగురవేశారు. కరోనా నేపథ్యంలో కొద్ది మంది నేతలకు మాత్రమే తెలంగాణ భవన్లోకి అనుమతించారు. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరికివారు తమ ప్రారంతాల్లోనే జెండా ఎగరవేయాలని సూచించారు. అట్లనే తెలంగాణ వ్యాప్తంగా తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చాలా నిరాడంబరంగా జరుగుతున్నాయి.