హెచ్చరించే కరోనా టోపీ

మహమ్మారి కరోనా వైరస్ కి మందు లేదు. ముందు జాగ్రత్తలే శరణ్యం. శుభ్రత, సామాజిక దూరం, శానిటైజర్స్ చేసుకోవడం ద్వారా కరోనాని మన దరికి చేరకుండా జాగ్రత్తపడొచ్చు. అయితే చేతులతో ముక్కు, నోరు.. టచ్ చేయకుండా ఉండటం కాస్త కష్టమే. అప్రయత్నంగా చేసే చర్యలని చేయకుండా.. నాగర్ కర్నూలుకి చెందిన ఓ యువకుడు ఓ టోపీని కనిపెట్టాడు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ఎన్జీవో కాలనీకి చెందిన శ్రీరామదాసు ధర్మసాయి బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కరోనా వ్యాప్తిలో భాగంగా ముక్కు, నోరు, కళ్లను తాక కూడదని వైద్యులు చెబుతుండటంతో పొరపాటున చేతులు ముఖం వద్దకు వెళ్లినా హెచ్చరించేలా టోపీని తయారు చేశాడు. చేయి ముఖం దగ్గరకు వెళ్లగానే టోపీకి అమర్చిన అలారం మోగడంతో పాటు ఎర్రబల్బు వెలుగుతుంది. దీనికోసం ఒక సెన్సర్, శబ్దం రావడానికి బజర్ అవి పనిచేయడానికి బ్యాటరీని అమర్చినట్లు, వాటి కోసం రూ.200 ఖర్చు అయిందని ధర్మసాయి చెబుతున్నాడు.