మే తర్వాత మంచి రోజులు
యావత్ ప్రపంచం ఇప్పుడు కష్ట కాలంలో ఉంది. కరోనా దెబ్బకి విలవిలాడుతోంది. కరోనా కట్టడి కోసం మనదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అనుకున్నా.. దాన్ని మరిన్ని రోజులు పెంచనున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి మంచిరోజులు ఎప్పుడొస్తాయి ? అని ప్రజలు ఆలోచిస్తున్నారు. మే నెలాఖరు తర్వాత మంచి రోజులని చూస్తామని ప్రముఖ హాస్య నటుడు వివేక్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు.
‘మనం ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. సంపూర్ణ లాక్ డౌన్ ను పాటిస్తే ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కవచ్ఛు ఇకనైనా ఆలోచించండి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అందరూ ఇళ్లలోనే ఉండండి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే తప్పకుండా భౌతిక దూరం పాటించండి. కొందరు నిపుణుల సమాచారం ప్రకారం మే ఆఖరు నుంచి మంచి రోజులు మొదలవుతాయని తెలుస్తోంది. కరోనా గండం నుంచి గట్టెక్కే అవకాశముంది. అప్పటి వరకు మనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి’ అని ఆయన కోరారు.
நன்றி @jayatvdottv https://t.co/xXEj833E0O
— Vivekh actor (@Actor_Vivek) April 27, 2020