కరోనాతో ఇద్దరు డాక్టర్లు మృతి
కంటికి కనిపించని శతృవుతో నిరంతరం యుద్ధం చేస్తున్నారు డాక్టర్లు, పోలీసులు, స్వఛ్ఛ కార్మికులు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన ప్రాణాలని పణంగా పెట్టి మరీ.. విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారి ప్రాణాలని కోల్పోతున్నారు. తాజాగా కోల్‌కతాలో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మరణించారు.
ఈ నెల 14న అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రముఖ హాస్పిట్లో చేరిన 69 ఏళ్ల ఆర్థోపెడిక్ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆరోగ్యం క్షీణించడంతో ఏప్రిల్ 17 నుంచి ఆయనకు వెంటీలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ.. సోమవారం రాత్రి ఆ డాక్టర్ మృతిచెందారు. ఇప్పటికే ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డా. బిప్లబ్ కాంతి దాస్‌గుప్తా అదే ఆస్పత్రిలో ఆదివారం మరణించారు. దీంతో బెంగాల్లో కరోనాతో మృతి చెందిన డాక్టర్ల సంఖ్య 2 కి చేరింది.