కొత్త రూల్ : సిక్స్ కొడితే బంతిని బ్యాట్స్ మెన్ నే తెచ్చుకోవాలి

కరోనా ఎఫెక్ట్ తో క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. సహచరులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. నెటిజన్స్ తో చిట్ చాట్ చేస్తున్నారు. టీవీ ఛాలెన్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్ ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

బంతిని షైన్‌ చేయడంపై చహల్ స్పందిస్తూ.. ‘బంతిని పాతబడే కొద్ది దానిని షైన్‌ చేయకపోతే మాకు స్వింగ్‌ చేసే అవకాశం ఉండదు. అప్పుడు వికెట్లు రావడం కూడా కష్టమవుతుంది. ఇక బ్యాట్స్‌మెన్‌ ఎప్పుడైనా సిక్స్‌ కొడితే ఆ బంతిని తిరిగి తెచ్చుకోవాలనే కొత్త రూల్‌ను క్రికెట్‌లో యాడ్‌ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే.. ? బంతిని షైన్ చేయకుంటే… బ్యాట్స్‌మెన్‌కు ప్రతీ బంతిని సిక్స్‌ కొట్టే అవకాశం ఇస్తుంది’ అన్నారు.

ఇక  కరోనా ప్రభావం తగ్గాక ముందుగా ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుంది. ఐపీఎల్‌ను రెండు నెలలు నిర్వహిస్తే ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్‌ దొరుకుతుంది. దీంతో రాబోయే సిరీస్‌లకు ఇది మంచి అవకాశంగా మారుతుందని చహల్ అభిప్రాయపడ్డారు.