అనసూయని నిరాశపరిచిన సుక్కు


అందరూ.. అనసూయ వైపు చూసేలా చేసిన దర్శకుడు సుకుమార్. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన హైలైట్ గా నిలిచింది. ఈ పాత్రని సుక్కు తీర్చిద్దిన విధానం అద్భుతం. రంగమ్మత్త పాత్ర తర్వాత దర్శక-నిర్మాతలు అనసూయని చూసే కోణం మారింది. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం అనసూయని పరిగణలోనికి తీసుకోవడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో అనసూయకి మంచి పాత్రలు దక్కుతున్నాయి.
 
ఈ క్రమంలో సుకుమార్ మరోసారి అనసూయ కోసం మంచి పాత్రని డిజైన్ చేశారు. అల్లు అర్జు-సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అనసూయని తీసుకున్నారు. బంధిపోటు పాత్రలో ఆమె కనిపిస్తారనే ప్రచారం జరిగింది. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? పుష్ప నుంచి అనసూయ అవుట్ అంటున్నారు. ఆమె స్థానంలో ప్రస్తుతం అవకాశాలు లేని ఓ సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలనే ప్లాన్ లో సుక్కు ఉన్నట్టు తెలుస్తోంది. అది ఇలియానా ? మరొకరా ?? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. 

ఇక ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక మందన నటించనుంది. కీలక పాత్రల కోసం కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది.