సామ్ కి ప్రేమతో.. చైతూ !
స్టార్ హీరోయిన్ సమంత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకి సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇక సామ్ పుట్టినరోజున ఆమె భర్త నాగ చైతన్య ఏం చేశాడో తెలుసా ? స్వయంగా కేట్ తయారు చేశాడు. సోమవారం అర్థరాత్రియే ఆ కేక్ ని కట్ చేయించి.. బర్త్ డే విషెస్ తెలిపాడు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను సామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అందులోని ఓ ఫొటోలో సామ్ కేక్ ముందు కూర్చుని దేవుడిని పార్థిస్తూ కనిపించారు. చైతన్య కేక్ చేసిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇక లాక్డౌన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన చై-సామ్ ఇష్టమైన పనులు చేస్తూ.. సినిమాలు చూస్తున్నారు. పెంపుడు శునకం హష్తో సమయం గడుపుతున్నారు.