పోలీసులపై రాళ్లదాడి
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అంత్యక్రియలు చేసే అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగుతున్న సంఘటనలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఇప్పటికే పంజాబ్, తమిళనాడుతో పాటు మరికొన్ని చోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకోగా తాజాగా హరియాణాలో మరో సంఘటన జరిగింది. హరియాణాలోని అంబాలాకు చెందిన 60ఏళ్ల వృద్ధురాలు అస్తమాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పోలీసుల సహాయంతో అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటికకు తీసుకెళ్లగా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న స్థానికులు దీన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా వైద్యులు, పోలీసులపైనే తిరగబడి రాళ్లతో దాడి చేశారు. చివరకి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. గ్రామస్థులని చెదరగొట్టారు.