బాలయ్య-రోజా.. ఓ భయంకరమైన రూమర్ !
బాలకృష్ణ-రోజాలది హిట్ కాంబో. వీరి కాంబోలో దాదాపు 8 సినిమాలొచ్చాయి. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులకు బాగా దగ్గరైన జంట ఇది. దర్శకులు కూడా ఈ జంట కోసం ఎదురు చూసేవాళ్లు. బాలకృష్ణతో సినిమా అనగానే రోజా.. వేరే సినిమాను వదులుకుని మరీ చేసిన సందర్భాలున్నాయట. అంతేకాదు.. అప్పట్లో బాలయ్య-రోజా పెళ్లి చేసుకోవాలనుకున్నారనే రూమర్ కూడా ఉంది.
అందుకే బాలయ్య-రోజా మరోసారి తెరను పంచుకోబోతున్నారంటే ఆసక్తి నెలకొంది. బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ సినిమా కోసం రోజాని తీసుకున్నారు. ఆమె విలన్ గా కనిపించనుంది. బాలయ్య ముందే తొడగొట్టనుంది అనే ప్రచారమ్ జరిగింది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.