బాంబు పేలి.. 40మంది మృతి !
రంజాన్ ఉపవాస దీక్ష వేళ ఉత్తర సిరియాలో ఘోరం జరిగింది. ఉత్తర సిరియాలోని ఓ మార్కెట్ లో బాంబు పేలి.. 40 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దారుణ ఘటన అఫ్రిన్ పట్టణంలో జరిగినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. సిరియా కుర్దిష్ దళాలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు టర్కీ ఆరోపించింది.
రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా షాపింగ్ చేసేందుకు వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ పేలుడుకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కుర్దిష్ మిలిటెంట్లతో లింకున్న వైపీజీ ఉగ్రవాద గ్రూపు.. ఉత్తర సిరియాలో సైనిక చర్యకు దిగినట్లు తెలుస్తున్నది. ఈ దాడిని అమెరికా ఖండించింది.