చిరు ‘డ్యాన్స్ డే’ వీడియో

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులని ఉత్సాహపరిస్తున్నారు. ప్రతిరోజు మెగాస్టార్ నుంచి ఓ ట్విట్టు, లేదంటే ఓ మెసేజ్, ఓ వీడియో.. ఏదో ఒకటివస్తూనే ఉంది. ఈ రోజు ఏప్రిల్ 29 – అంతర్జాతీయ డ్యాన్స్ దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనకి డ్యాన్స్‌కి తనకి ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని వీడియో ద్వారా గుర్తు చేసుకున్నారు.

సంగీతం వలె, డాన్స్ కూడా ధ్యానంలా పని చేస్తుంది. ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా.. నేను డ్యాన్స్ చేస్తే. ఒత్తిడిని దూరం చేసుకొనేందుకు ప్రయత్నిస్తా. కరోనా ఎఫెక్ట్ తో ఒత్తిడిలో ఉన్న మీరు కూడా ఇంట్లో సరదాగా డ్యాన్స్ చేయండీ. ఆ వీడియోస్ ని స్నేహితులతో పంచుకోండి. నేనుకూడా ఈరోజు.. ఇటీవల చేసిన డ్యాన్స్ మూమెంట్స్ తో ఓ చిన్ని వీడియోని సాయంత్రం ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తానని తెలిపారు.