చిన్నమ్మ శశికళ ఔట్

చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకి గురైంది. ఆమెతో పాటు డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న దినకరన్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం చిన్నమ్మ శశికళ సీఎం పీఠం కోసం ఆరాటపడిన విషయం తెలిసిందే.

అక్రమాస్తుల కేసు ఆమెని సీఎం పదవికి దూరం చేసింది. చివరకు ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటై శశికళ వర్గాన్ని బయటికి నెట్టారు. ప్రస్తుతం పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి వ్యవహరించనున్నారు. జయలలిత నియమించిన ఆఫీస్‌ సిబ్బందిని అలాగే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. రెండాకుల గుర్తు కూడా తమదేనని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది.