చికిన్, మటన్ అమ్మకాల్లో దారుణాలు
లాక్‌డౌన్ వేళ చికెన్, మటన్ అమ్మకాల్లో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ధరలు పెంచి అమ్మడం, రెండు, మూడు రోజుల క్రిందటి మాంసాన్ని కూడా స్టికర్ మార్చి అమ్మడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని చికెన్, మటన్ దుకాణాలపై నాలుగైదు రోజులుగా పశు సంవర్థక శాఖ దాడులు కొనసాగుతున్నాయి.
ఈ దాడులు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా పరిశుభ్రత, నాణ్యత, లైసెన్సులు లేకుండా నడుపుతూ అధిక ధరలకు మటన్, చికెన్ విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆరు దుకాణాలను సీజ్ చేశారు. మిగిలిన మాంసాన్ని స్టిక్కర్ మార్చేసి మరునాడు కూడా విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. మటన్ కిలో రూ.700, చికెన్ రూ.172కు మించి విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని డాక్టర్ బేరిబాబు ప్రజలకు సూచించారు.