మోడీని అన్ ఫాలో చేసిన వైట్‌హౌజ్.. కారణమేంటో ?
వైట్‌హౌజ్ అమెరికా అధ్యక్షుడి నివాసభవనం అనుసరిస్తున్న ఏకైక ప్రపంచ నేత భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్న సంగతి తెలిసిందే. అయితే వైట్‌హౌజ్ సడెన్ షాక్ ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని కార్యాలయం ట్విటర్ ఖాతాలను వైట్‌హౌజ్ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. ఇందుకు గల కారణాలేంటో వెల్లడించలేదు.
ఏప్రిల్ 10 నుంచి వైట్‌హౌజ్ మోదీని అనుసరించడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ మధ్య స్నేహం, సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఇలా చేసింది. ట్రంప్ వ్యవహార శైలి తెలిసిందే. ఆయన రియాక్షన్స్ అన్నీ అనూహ్యంగా ఉంటాయ్. కరోనా విషయంలో చైనాని సపోర్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థకి నిధులు నిలిపేస్తామని ప్రకటించిన ట్రంప్.. వెంటనే ఆ పని చేశాడు. మరీ.. తాజాగా ఆయన భారత్ పై అలకకి కారణమేంటీ ? అన్నది తెలియాల్సి ఉంది.