సీఎం జగన్ కు జేడీ మద్దతు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ విషయంలో సీఎం జగన్ సర్కార్ కి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు నిలిచారు. లాక్ డౌన్ సమయంలో మరిన్ని టెస్టులను చేయడం మంచిదేనని, ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరణాల సంఖ్య తక్కువగానే ఉందని ఆయన గుర్తు చేశారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం.. ఎన్ని ఎక్కువ టెస్ట్ లు చేస్తే అంత మంచిదని లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలని లక్ష్మీ నారాయణ సూచించారు. ఆపై రెడ్ జోన్లపై మరింత దృషని సారించి, మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేయవచ్చని సూచించారు. ఇక మే 3 తరువాత కూడా పంజాబ్, ఒడిశాలు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని ప్రకటన చేశాయి. తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్  కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇక జనసేన పార్టీకి రాజీనామా చేసిన జేడీ మరే పార్టీలోనూ చేరలేదు. తాజాగా కరోనా విషయంలో జేడీ సీఎం జగన్ కి మద్దతుగా మాట్లాడిన నేపథ్యంలో.. ఆయన వైసీపీ వైపు చూస్తున్నరా ? అనే అనుమానాలు రెకెత్తుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటికిప్పుడే ఓ అభిప్రాయానికి రాలేము. ఎందుకంటే.. ? ప్రస్తుతం రాజకీయాల గురించే ఆలోచించే పరిస్థితిలో ఎవరు లేరు. కరోనా ప్రభావం తగ్గాకే.. ఇతర విషయాలపై ఫోకస్ పడనుంది.