కోతులపై కరోనా టీకా ప్రయోగం.. సక్సెస్ !
ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా మహమ్మారికి మందు లేదు. మందు కనిపెడితేనే కరోనాని పూర్తిగా కంట్రోల్ చేయగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా టీకా కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఆక్స్ ఫర్ట్ శాస్త్రవేత్తలు కరోనా టీకాని కోతులపై ప్రయోగించకగా అది సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.
కోతుల జన్యు క్రమానికి, మానవుల జన్యు క్రమానికి 93 శాతం వరకూ పోలికలు ఉండటంతో, ఇప్పుడు ఇదే టీకాను మానవులపై ప్రయోగిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ టీకా నమ్మకమైన ఫలితాన్ని ఇస్తుందని అంచనా వేవస్తున్నారు.మొత్తం 12 ఆరోగ్యవంతమైన కోతులను ఎంపిక చేసుకున్న శాస్త్రవేత్తలు, వాటిని రెండు జట్లుగా విభజించి, వేర్వేరుగా ఉంచారు. ఆరు కోతులకు కరోనా వైరస్ సోకేలా చేశారు. మరో ఆరు కోతులకు టీకాను ఇచ్చిన తరువాత కరోనా వైరస్ సోకేలా చేశారు.
టీకా ఇవ్వని కోతులు తీవ్ర అనారోగ్యం బారిన పడగా, టీకా తీసుకున్న కోతుల్లో 28 రోజుల తరువాత కూడా ఎలాంటి అనారోగ్య లక్షణాలూ కనిపించలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో కరోనాకి వాక్సిన్ త్వరలోనే రాబోతుందన్న ఆశలు చిగురించాయని చెబుతున్నారు.