అనిల్ ఫోర్ కొట్టేశాడు

ఇంతవరకు అపజయం ఎరగని దర్శకుల లిస్టులో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన తీసిన ప్రతీ సినిమా సూపర్ హిట్టే. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు నాన్ స్టాప్ విజయాలతో దూసుకెళ్తున్నారు. ఆయన తదుపరి సినిమాగా ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 రాబోతుంది. ఎఫ్ 2 నటీనటులు వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లతోనే ఎఫ్ 3 తీసుకొస్తానని ఇప్పటికే అనిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఎఫ్ 3 కాకుండా మరో మూడు కథలు రెడీ చేశాడట అనిల్. ఆయన కలం బలం గొప్పది. అందులో వినోదం ఉంటుంది. బలమైన కథ ఉంటుంది. అంతేకాదు వేగం కూడా ఉంటుంది. అందుకే ఆయన ఫోర్ కొట్టేశారు. ఏకంగా నాలుగు కథలు రెడీ చేసుకొని పెట్టుకున్నారని చెబుతున్నారు. ఎఫ్ 3 కాకుండా మిగిలిన మూడు కథలని ఏ హీరోలకోసం రాశాడన్నది తెలియాల్సి ఉంది.