కంటతడి పెట్టిస్తున్న రిషి కపూర్ ట్విట్లు

‘తాను చనిపోయినా.. తన అంత్యక్రియలకి ఎవరు రారు’ అని 2017లోనే రిషి కపూర్ అన్నారు. ఇప్పుడు అదే జరిగింది. లాక్‌డౌన్ కారణంగా ఆయన అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేని పరిస్థితి. అంత్యక్రియలకు కేవలం 20 మంది మాత్రమే హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ముంబైలోని మరీనా లైన్స్‌లోని చందన్‌వాడీ స్మశానవాటిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. దీంతో 2017లో రిషి కపూర్ చేసిన ట్విట్లు ఇప్పుడు నిజమయ్యాయని అభిమానులు కంటతడిపెట్టుకున్నారు.

ఇంతకీ రిషీ కపూర్ అలా ఎందుకు ట్విట్స్ చేయాల్సి వచ్చిందంటే.. ? 2017 ఏప్రిల్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి చెందారు. అయితే వినోద్ ఖన్నా అంత్యక్రియలకు బాలీవుడ్‌ నుంచి సెలబ్రిటీలు ఎక్కువశాతం హాజరుకాలేదు. ఈ ఘటన రిషికపూర్‌కు ఆగ్రహం తెప్పించింది. అంతటి నటుడు మృతి చెందితే.. కనీసం ఆయనకు నివాళి అర్పించేందుకు కూడా ఎవరూ రాకపోవడం సిగ్గుచేటు అంటూ రిషికపూర్ ట్వీట్ చేశారు. 

ఆయనతో కలిసి పని చేసిన వాళ్లు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరుకాకపోవడంపై మండిపడ్డారు.ఇది ఇంతటితో ఆగదు. నా విషయంలోనే.. వేరే వాళ్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. నేను చనిపోయినప్పుడు. నన్ను మోసేందుకు ఎవరూ ఉండరు. అందుకు సిద్ధంగా ఉండాలి. ఈరోజు స్టార్స్ అని చెప్పుకొనే వాళ్లని చూస్తే.. చాలా చాలా కోపం వస్తుందని అప్పుడు రిషి కపూర్ ట్విట్ చేశారు.