లాక్‌డౌన్ టైమ్’లోనూ మందు కొడుతున్న హీరోయిన్

కరోనా లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. దీంతో సినీ ప్రముఖులు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయంలో నచ్చిన పనులు చేసుకుంటున్నారు. కొత్త పనులు చేసుకుంటున్నారు. మరీ.. బోర్ కొడితే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. మరికొందరు #ThrowbackPics పేరుతో ఓల్డ్ పిక్స్ షేర్ చేస్తున్నారు.

తాజాగా తెలుగమ్మాయి తేజస్వి వైన్ బాటిల్‌తో పోజుచ్చిన ఓ పోటోని షేర్ చేసింది. చాలారోజుల క్రితం చేసిన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటో ఇది. ఈ ఫోటోను చూసిన నెటిజన్. లాక్‌డౌన్‌లో మందెక్కడ దొరికింది చెప్మా! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు లాక్‌డౌన్ టైంలోనూ తేజస్వీ మందుకొడుతోంది అంటూ సరదగా కామెంట్స్ చేస్తున్నారు.