తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే !
కరోనా కట్టడి కోసం దేశంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 3 (మే3) వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. తెలంగాణలో మాత్రం మరో నాలుగు రోజులు అదనంగా అంటే.. మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్ ని ఎత్తేస్తారా ? అంటే.. ప్రస్తుతానికి క్లారిటీ లేని విషయం ఇది. లాక్‌డౌన్ ఎత్తివేయకుంటే దేశంలో ఆకలి చావులు అధికమవుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆరేంజ్, గ్రీన్ జోన్లలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. రోడ్ జోన్లలోమాత్రం యధావిథిగా లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలవారీగా రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్లుగా విభించారు. తెలంగాణకి సంబంధించి తాజాగా కేంద్ర ప్రకటించిన జోన్స్ ఇలా ఉన్నాయి.
రెడ్ జోన్ జిల్లాలు :
* మేడ్చల్
* వికారాబాద్
* వరంగల్ అర్బన్
* హైదరాబాద్
* సూర్యపేట
*రంగారెడ్డి.
ఆరెంజ్ జోన్ జిల్లాలు :
* నిజామాబాద్
* గద్వాల
* నిర్మల్
* నల్లగొండ
* ఆదిలాబాద్
* సంగారెడ్డి
* కామారెడ్డి
* ఆసిఫాబాద్
* కరీంనగర్
* ఖమ్మం
* మహబూబ్‌నగర్
* జగిత్యాల
* సిరిసిల్ల
* జయశంకర్ భూపాలపల్లి
* మెదక్
* జనగామ
* నారాయణపేట
* మంచిర్యాల,
గ్రీన్‌జోన్ జిల్లాలు :
* పెద్దపల్లి
* నాగర్‌కర్నూల్
* ములుగు
* భద్రాద్రి కొత్తగూడెం
* మహబూబాబాద్
* సిద్దిపేట
* వరంగల్ రూరల్
* వనపర్తి
* యాదాద్రి