చాలా మందితో ఎఫైర్స్ నడిపించా
ఐటమ్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రాయ్ లక్ష్మీ. హీరోయిన్ గా కన్నా ఐటమ్ భామగా ఎక్కువ పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల కన్నా లవ్ ఎఫైర్స్ నడిపించడంలో స్పెషలిస్ట్ అనిపించుకుంది. ఈ బ్యూటీ చాలా మందితోనే ఎఫైర్స్ నడిపించినట్టు వార్తలు వినిపించాయి. ఈ లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నారని చెప్పుకొంటున్నారు. ధోనితో కలిసి బైక్ రైడ్ కి వెళ్లినట్టు.. ఓ సందర్భంలో రాయ్ లక్ష్మీ తెలిపిన సంగతి తెలిసిందే.
ఎఫైర్స్ గురించి కూడా ఆమె ఏమీ దాచలేదు. “నాకు చాలా మందితో లవ్ ఎఫైర్స్ ఉన్నాయ్. బ్రేకప్స్ కూడా జరిగాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రేమలో మోసపోయా. ఎంతమందితో లవ్ ఎఫైర్ నడిపిన తనకి.. ఓ మంచి వ్యక్తి దొరుకుతాడని ఎదురు చూస్తున్నా. అయితే ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే”నని రాయ్ లక్ష్మీ చెప్పుకొచ్చింది.