యష్ కొడుకుకి హాయ్ చెప్పండి.. !
కన్నడ స్టార్ యష్-రాధిక పండింట్ దంపతులు తమ కొడుకుని అభిమానులకి పరిచయం చేశారు. యశ్-రాధిక 2016లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా పాప ఐరా పుట్టింది. రెండో సంతానంగా కుమారుడు పుట్టాడు. అక్టోబర్ 30,2019న పుట్టిన కుమారుడిని యష్ దంపతులు ఇప్పటి వరకు బయటికి చూపించలేదు.
తాజాగా బుడ్డోడి ఫోటోని తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు యశ్. ‘మా చిన్నోడికి హాయ్ చెప్పండి, అతనికి మీ ప్రేమ ఆశీర్వాదాలు అందించండి’ అని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోని చూసి యష్ అభిమానులు మురిసిపోతున్నారు. బుడ్డోడి ఫోటోకి జూనియర్ రాఖీ భాయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం యష్ కేజీఎఫ్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు.