దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్ జోన్ లో ! 

కరోనా వ్యాప్తి, తీవ్రత ఆధారంగా జిల్లాలవారీగా.. రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్ల జాబితాని కేంద్రం రెడీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్ జోన్ లోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ సహా ఆరు ప్రధాన నగరాల్లో వైరస్ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా రెడ్ జోన్ లో ఉన్నాయని తెలిపింది.

ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ తో పాటు ఫరీదాబాద్, నోయిడా, మీరట్  రెడ్ జోన్ లోనే ఉన్నాయి. గుడ్ గావ్, ఘజియాబాద్ మాత్రం ఆరెంజ్ జోన్లో  ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో 6, ఏపీలో 5 జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయి.